ఇంకోసారి ట్వీట్లు చేయను!
ఇంకోసారి ట్వీట్లు చేయను!
హైదరాబాద్ః వరుస ట్వీట్లతో నటుడు రామ్ పోతినేని పేరు మీడియాలో మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో… హీరో రామ్ మరో ట్వీట్ చేశారు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ఘటనపై ఇంకోసారి తాను ట్వీట్ చేయనని రామ్ ప్రకటించారు. న్యాయంపై తనకు నమ్మకముందని, ఎవరైనా, ఎవరికి చెందిన వారైనా నిజమైన దోషులకు శిక్ష పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
విచారణకు ఆటంకం కలిగిస్తే రామ్‌కి నోటీసులిస్తాం: ఏసీపీ సూర్యచంద్రరావు
విచారణకు ఆటంకం కలిగిస్తే ఎవరికైనా నోటీసులు ఇవ్వడానికి వెనుకాడబోమని ఏసీపీ సూర్యచంద్రరావు పేర్కొన్నారు. ఎసిపి ఆదివారం మీడియాతో మాట్లాడారు.. రమేశ్ ఆసుప్రతి వ్యవహారంపై విచారణ జరుపుతున్నాం. విచారణకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్‌కి కూడా నోటీసులిస్తాం. ప్రమాదానికి పూర్తి బాధ్యత ఎవరిది అన్నది దర్యాప్తులో తేలుతుంది అని తెలిపారు.
కాగా అగ్నిప్రమాదంలో పదిమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సినీ హీరో రామ్ ట్వీట్లను పోలీసులు తప్పుపడుతున్నారు .క్వారెంటైన్ సెంటర్‌కి కోవిడ్ కేర్ సెంటర్‌కి తేడా తెలుసుకోకుండా పోస్టింగులు పెట్టడం సరికాదంటున్నారు. బాబాయ్ డాక్టర్ రమేష్ని కాపాడుకొనేందుకు అసత్య ఆరోపణలతో విచారణకు అడ్డు తగిలితే రామ్‌కి కూడా నోటీసులు ఇస్తామని హెచ్చరిస్తున్నారు.