ఐఐటి కాన్పుర్‌లో 34 టెక్నికల్ పోస్టులు
IITK: ఇండియన్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజి కాన్పుర్ (ఐఐటికె) వివిధ విభాగాల్లో టెక్నికల్ పోస్టులను భర్తీ చేయుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 34. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. దరఖాస్తులను ఈ నెల 31లోపు ఆన్‌లైన్‌లో పంపించాల్సి ఉంది.
సీనియర్ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ ఎస్ ఇ)-1
సూపరింటెండెంట్ ఇంజినీర్ (డిసిఇ & డిఇఇ)-2
ఈ రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 57 ఏళ్లు మించకూడదు.
డిప్యూటి రిజిస్ట్రార్-2
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డిసిఇ & డిఇఇ)-2
పై రెండు పోస్టులకు అభ్యర్థుల వయస్సు 21 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
అసిస్టెంట్ కౌన్సిలర్ -3
అసిస్టెంట్ రిజిస్ట్రార్ -1
అసిస్టెంట్ రిజిస్ట్రార్(లైబ్రరి) -1
హాల్ మేనేజ్ మెంట్ ఆఫీసర్ -1
మెడికల్ ఆఫీసర్ -2
పైన పేర్కొన్న పోస్టులకు అభ్యర్థుల వయస్సు 21 నుండి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
అసిస్టెంట్ సెక్యూరిటి ఆఫీసర్ (ఫర్ విమెన్) -2
అసిస్టెంట్ స్పోర్ట్స్ ఆఫీసర్ – 2
జూనియర్ టెక్నికల్ సూపరింటెండ్ (కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, డీన్ ఆఫ్ అకడెమిక్ అఫైర్స్) -3
పై పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21-35 ఏళ్ల మధ్య ఉండాలి
.జూనియర్ అసిస్టెంట్ -12
జూనియర్ అసిస్టెంట్‌లకు 21 నుండి 30 ఏళ్ల వయస్సు ఉండాలి.
అర్హత పోస్టులను అనుసరించి డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ (సివిల్, ఎలక్ట్రికల్), ఎంఫిల్ (క్లినికల్ సైకాలజి), హోటల్ మేనేజ్ మెంట్ , ఎంబిబిఎస్, డిగ్రీ (బిపిఇడి), పిజి (ఎంసిఎ, ఎంఎస్‌సి)తో పాటు పని అనుభవం ఉండాలి.
ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం www.iitk.ac.in/new/recruitment వెబ్‌సైట్ చూడగలరు.