దేశంలో తొలిసారిగా.. ఎపిలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు
అమరావతి (CLiC2NEWS): రేపటి నుండి ఆంధ్రప్రదేశ్‌లో గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాపౌర సేవలు అందించేందుకు, ప్రజల నుండి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారన్ని చేరవేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ యి. ప్రభుత్వం తీసుకురానుంది. దేశంలోనే తొలిసారిగా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వాట్సాప్ గవర్నెన్స్‌పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వం నుండి ప్రజలకు ఏదైనా సమాచారం అందాలంటే ఈ వాట్సాప్ ఖాతా ద్వారా సందేశం పంపిస్తుంది. వర్షాలు కారణంగా ప్రజలను అప్రమత్తం చేయాలన్నా.. పాఠశాలలకు సెలవు ప్రకటించడం, విద్యుత్ అంతరాయం కారణంగా సరఫరా నిలిపివేడం, వైరస్ వ్యాప్తి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ప్రభుత్వం చేపట్టే పథకాలు .. ఇలా ఏ విషయాన్నైనా ప్రజలకు చేరవేస్తుంది. ఒకే సారి కోట్ల మందికి సమాచారం చేరుతుంది. అంతేకాకుండా ప్రజల నుండి వినతులు, ఫిర్యాదులు ప్రభుత్వానికి చేరవేస్తుంది. ఒక నంబర్‌కు మెసేజ్ చేస్తే వెంటనే వారికి ఒక లింక్ వసత్ఉంది. అందులో సంబంధిత వ్యకతి పేరు, ఫోన్ నంబర్, చిరునామా పొందుపరిచి.. వినతిని టైప్ చేస్తే .. ఒక రిఫరెన్స్ నంబర్ వసత్ఉంది. దాని ఆధారంగా తమ వినతి లేదా ఫిర్యాదు పరిష్కారం ఎంతవరకు వచ్చిందో .. ఎవరి వద్ద ఉందో తెలుసుకోవచ్చు.
దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ప్రభుత్వం అధికారికంగా వాట్సాప్ నంబర్‌ను ప్రకటిస్తుంది. ఆ ఎకౌంట్‌కు వెరిఫైడ్ ట్యాగ్ (టిక్ మార్క్ ) ఉంటుంది. ఈ నెంబర్ వన్‌స్టాప్ సెంటర్లా పనిచేస్తుంది. ముందుగా దీనిలో 161 రకాల సేవలు అందించనున్నారు. ఈ సేవలను మంత్రి లోకేష్ గురువారం అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.