బడ్జెట్ సమావేశాలు.. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం
ఢిల్లీ (CLiC2NEWS): పార్లమెంట్లో నేడు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ప్రయాగ్ రాజ్ మహా కుభమేళా జరుగుతున్న సమయంఓల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభించుకుంటున్నామని.. గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నామని రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.
బడ్జెట్లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యం ఉండనున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. పేదరిక నిర్మూలన కోంస అనేక పథకాలు అమలు చేస్తున్నామని.. 25 కోట్ల మందిని దారిద్య్రం నుండి బయటకు తీసుకొచ్చామన్నారు. ఆముష్మాన్ భారత్ పథకం కింద 70 ఏళ్లు పైబడిన ఆరు కోట్ల మంది వృద్ధులకు ఆరోగ్య బీమా అందిస్తున్నామన్నారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు గొప్ప ముందడుగని.. నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ ద్వారా 91 లక్షలకు పైగా స్వయం సహాయక బృందాలకు సాధికారికత కల్పిస్తున్నామని తెలిపారు.
ఆరంభంలో మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనసై రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. అదేవిధంగా మాజి ప్రధాని మన్మోహన్ సింగ్కు శ్రద్ధాంజలి ఘటించారు.