రాజేంద్ర‌న‌గ‌ర్‌లో చిన్నారిపై వీధికుక్క‌ల దాడి

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలో ఏ వీధిలో చూసినా శున‌కాలు అధికంగా కనిపిస్తున్నాయి. పెద్ద చిన్నా తేడా లేకుండా ఒంట‌రిగా వెళుతున్న వారిపై దాడి చేస్తున్నాయి. దీంతో చిన్నారులను బ‌య‌ట‌కు పంపాలంటేనే త‌ల్లిదండ్రులు భ‌య‌ప‌డుతున్నారు. తాజాగా రాజేంద్ర‌న‌గ‌ర్ ప్రాంతంలో ఒ ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై రెండు శున‌కాలు దాడి చేశాయి. అటుగా ఎవ్వ‌రూ వెళుతున్న జాడ కూడా లేదు. ఆ చిన్నారే కుక్క‌ల‌ను ప్ర‌తిఘ‌టిస్తూ ఉంది. ఇంత‌లో ఓ మ‌హిళ రాగా శున‌కాలు అక్క‌డి నుండి పారిపోయాయి. అక్క‌డ‌ ఉన్న సిసి కెమెరాలో  దృశ్యాలు న‌మోద‌య్యాయి.

Leave A Reply

Your email address will not be published.