ఆప్ పార్టీని వీడిన ఏడుగురు ఎమ్మెల్యేలు

ఢిల్లీ (CLiC2NEWS): ఎన్నిక‌ల వేళ కేజ్రివాల్‌కు బిగ్‌షాక్ త‌గిలింది. ఆమ్ ఆద్మీ పార్టీలో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. మ‌రో ఐదు రోజుల్లో దేశ రాజ‌ధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆప్ జాతీయ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పార్టీ ప‌ట్ల‌, మీ ప‌ట్ల విశ్వాసం కోల్పోయిన‌ట్లు కేజ్రీవాల్‌కు లేఖ‌లు పంపారు. పోలీంగ్ స‌మీపిస్తున్న అత్యంత కీల‌క స‌మ‌యంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేయ‌డం.. అయితే , ఈ సారి ఎన్నిక‌ల్లో తిరిగి పోటీ చేసేందుకు వీరెవ‌రికీ ఆప్ నుండి అవ‌కాశం రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

రాజీనామా చేసిన వారిలో భావ‌నా గౌర్‌, జ‌న‌క్‌పురి ఎమ్మెల్యే రాజేశ్ రిషి, త్రిలోక్‌పురి ఎమ్మెల్యే రోహిత్ మెహ్రౌలియా, క‌స్తూర్బా న‌గ‌ర్ మ‌ద‌న్ లాల్ , మెహ్రౌలి ఎమ్మెల్యే న‌రేశ్ యాద‌వ్‌, ప‌వ‌న్ శ‌ర్మ , బిజ్వాస‌న్ ఉన్నారు. వీరంతా త‌మ రాజీన‌మా లేఖ‌ల‌ను ఢిల్లీ అసెంబ్లీ స్పీక‌ర్ రాం నివాస్ గోయ‌ల్‌కు అంద‌జేశారు. ఢిల్లీలో ఈ నెల 5 వ తేదీన‌ 70 స్థానాల‌కు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి. 8 వ తేదీన ఓట్ల లెక్కింపు జ‌రుగుతుంది.

Leave A Reply

Your email address will not be published.