భార‌త ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌లో సీనియ‌ర్ ఇంజినీర్ పోస్టులు..

BEL: ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ సంస్థ భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) బెంగ‌ళూరులో సీనియ‌ర్ ఇంజినీర్ గ్రేడ్‌-3 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం పోస్టులు 14. ఈ ఉద్యోగాల‌ను రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూల ఆధారంగా భ‌ర్తీ చేయ‌నున్నారు. ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం రూ.50 వేల నుండి రూ.1,60,000 వ‌ర‌కు ఉంటుంది. ద‌ర‌ఖాస్తుల‌ను జూన్ 16 లోపు ఆన్‌లైన్లో పంపించాల్సి ఉంది. పోస్టును అనుస‌రించి సంబంధిత విభాగాల్లో బిఇ/ బిటెక్/ ఎంఇ/ ఎంటెక్ (మెకానికల్‌/ ఎల‌క్ట్రానిక్స్‌/ కంప్యూట‌ర్ సైన్స్‌) ఉత్తీర్ణ‌త‌తో పాటు పని అనుభ‌వం అవ‌స‌రం.

ద‌ర‌ఖాస్తు రుసుం రూ. 400.. ఎస్‌టి, ఎస్సి, పిడ‌బ్ల్యు బిడిలు ఫీజు లేదు.
అభ్య‌ర్థుల వ‌య‌స్సు 1.5.2025 నాటికి 35 ఏళ్లు ఉండాలి. ఒబిసిల‌కు మూడేళ్లు.. ఎస్‌టి, ఎస్‌సిల‌కు ఐదేళ్లు .. దివ్యాంగుల‌కు ప‌దేళ్ల స‌డ‌లింపు వ‌ర్తిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.