IPL FINAL : RCB vs PBKS

IPL: అహ్మదాబాద్ వేదికగా ఐపిఎల్ 18వ సీజన్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మంగళవారం సాయంత్రం పంజాబ్ కింగ్స్, ఆర్సిబి తలపడుతోంది. క్వాలిఫయర్-1లో పంజాబ్‌ను ఓడించిన ఆర్సిబి ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్ పోరులో మళ్లీ పంజాబ్‌తో తలపడుతుంది. ఆర్సిబి 2009, 2011, 2016లో కూడా ఫైనల్‌కు వెళ్లింది. కానీ, ఫైనల్లో విజయం సాధించలేకపోయింది. ఈ సారి ఆర్సిబి టైటిల్ సాధించాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
పంజాబ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.