ఫ్లాట్‌లో బంధించి.. అశ్లీల చిత్రాల్లో న‌టించాలిన ఒత్తిడి..

కోల్‌క‌తా (CLiC2NEWS): అశ్లీల చిత్రాల్లో న‌టించాల‌ని ఓ యువ‌తిని 6 నెల‌లుగా ఫ్లాట్‌లో బంధించి చిత్రహింస‌ల‌కు గురిచేసిన ఘ‌ట‌న పశ్చిమ బెంగాల్‌లో తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ త‌ల్లీ కుమారుడు ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టారు. ఉద్యోగం పేరుతో ట్రాప్ చేసి యువ‌తుల‌ను అశ్లీల చిత్రాల్లో న‌టించాల‌ని బంలవంతం చేసున్న‌ట్లు స‌మాచారం. వారి నుండి త‌ప్పించుకున్న ఓ బాధితురాలు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. 6 నెల‌లుగా ఆమెను చిత్ర‌హింస‌ల‌కు గురిచేసిన‌ట్లు తెలిపింది. బాధితురాలికి ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స‌నందిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆర్య‌న్ ఖాన్ అత‌ని త‌ల్లీ ఈవెంట్ మేనేజ్‌మెంట్స్ ఏజెన్సీ న‌డుపుతూ అశ్లీల వీడియోల రాకెట్‌ను , దానికి సంబంధించిన ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్ హౌన్‌ను న‌డుపుతున్న‌ట్లు స‌మాచారం . దీనిలో భాగంగా ఎక్కువ వేత‌నం ఆశ‌చూపి యువ‌తుల‌ను ఉద్యోగం పేరుతో న‌మ్మించేవారు. అనంత‌రం వారిని అశ్లీల చిత్రాల్లో న‌టించాలిన బల‌వంతం చేసేవారు. 6 నెల‌ల క్రితం ఉత్త‌ర ప‌ర‌గ‌ణా జిల్లాకు చెందిన ఓ యువ‌తి ఉద్యోగం కోసం ఫేస్‌బుక్‌లో ఆర్య‌న్‌ను సంప్ర‌దించింది. అత‌డు ఉద్యోగం ఇప్పిస్తాన‌ని.. త‌మ ఇంటికి రావాల‌ని చెప్ప‌డంతో ఆ యువ‌తి వెళ్లింది. ఆర్య‌న్ అత‌ని త‌ల్లి.. ఆ యువ‌తి బార్ డాన్స‌ర్ వృత్తిలోకి దించ‌డానికి ప్ర‌య‌త్నించారు. దానికి ఆ యువ‌తి నిరాక‌రించ‌డంతో ఆమెపై దాడిచేసి ఆమెను నిర్భందించారు. 6 నెల‌ల పాటు ఇనుప‌రాడ్ల‌తో కొట్టే వారని.. నాలుగు రోజుల‌కు ఒక‌సారే భోజ‌నం పెట్టే వారిని పోలీసుల‌కు వెల్ల‌డించింది. పోలీసులు ప‌రారీ ఉన్నార‌ని.. వారిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.