తమిళనాడు శివకాశిలో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురి మృతి
శివకాశి (CLiC2NEWS): తమిళనాడు శివకాశిలోని బాణాసంచా కర్మాగారంలో మంగళవారం భారీ పేలుడు జరిగి ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. మృతి చెందిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నారు. పలువురికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలో మంటలను అదుపులోకి తెచ్చారు. బాణా సంచా తయారీ కేంద్రం కావడంతో ఒక్కసారిగా మంటలు భారీ ఎత్తుకు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.