సినీ న‌టి వాసుకికి ఆర్ధిక సాయం అందించిన డిసిఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): సినీ న‌టి వాసుకి (పాకిజా) గురించి తెలియ‌ని తెలుగు సినీ ప్రేక్ష‌కులు ఉండ‌రు. తెలుగు సినిమాల్లో ఆమె కామెడీ పాత్ర‌లు ఎంత‌గానో అల‌రించాయి. ప్ర‌స్తుతం వాసుకి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇటీవ‌ల ఆమె త‌న దుస్థితిని వివ‌రిస్తూ.. ఎపి సిఎం, డిసిఎం ఆర్ధిక సాయం చేసి ఆదుకోవాలంటూ చేయాలంటూ చేసిన వీడియో ప‌వ‌న్‌క‌ల్యాణ్ దృష్టికి వెళ్లింది. దీంతో డిసిఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ వాసుకికి రూ.2ల‌క్ష‌ల ఆర్ధిక సాయం అంద‌జేశారు.

వాసుకి.. ఎపి సిఎం, డిప్యూటి సిఎంల‌కు న‌మ‌స్కారాలు. తాను హ‌స్య న‌టిని పాకీజా అని.. ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు లేక సొంత ఊరు కారైకుడికి వచ్చాన‌ని.. సాయం చేస్తారేమోన‌ని సిఎం, డిసిఎంను క‌ల‌వడానికి విజ‌య‌వాడ వ‌స్తే కుద‌ర్లేద‌ని వీడియోలో తెలిపింది. త‌మిళ‌నాడులో త‌న‌కు ఆధార్ ఉంద‌ని.. దాని ఆధారంగా ఎపిలో నెల నెలా పెన్ష‌న్ వ‌చ్చేలా చేయాల‌ని వాసుకి వీడియోలో వేడుకుంది. గ‌తంలో చిరంజీవి, నాగ‌బాబు గారు సాయం చేశారు. ప్ర‌స్తుతం ఎపి సిఎం , డిసిఎం ఆదుకోవాల‌ని వేడుకుంది. ఆ వీడియో వైర‌ల్ అయ్యింది.

Leave A Reply

Your email address will not be published.