విమానంలో పాము.. అర‌గంటపాటు శ్ర‌మించి ప‌ట్టుకున్న సిబ్బంది

మెల్‌బోర్న్ (CLiC2NEWS): అస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులో టేకాఫ్‌కు సిద్దంగా ఉన్న ఓ విమానంలో పాము దూరింది. ప్ర‌యాణికులు భ‌ద్ర‌ప‌రిచే ప్రాంతంలోకి పాము వెళుతుండ‌గా సిబ్బంది గుర్తించారు. వెంట‌నే అధికారులు స్నేక్ క్యాచ‌ర్స్‌ను పిలిపించారు. వారు అర‌గంట పాటు శ్ర‌మించి ఆ విష‌పూరిత పామును ప‌ట్టుకున్నారు. అనంత‌రం విమానానికి త‌నిఖీలు నిర్వ‌హించి టేకాఫ్ చేశారు. దీంతో విమానం రెండు గంట‌ల ఆల‌స్యంగా టేకాఫ్ అయింది. మెల్‌బోర్న్ ఎయిర్ పోర్ట్ నుండి బ్రిస్బేన్‌కు వెళ్లే విమానంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

Leave A Reply

Your email address will not be published.