స్త్రీ నిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు..
ఎపి, విజయవాడలోని రాష్ట్ర స్థాయి అపెక్స్ సహకార సంస్థ అయిన స్వయం సహాయక మహిళా గ్రూప్ – స్త్రీ నిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో 170 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు కాంట్రాక్ట్ పద్దతిలో ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు వేతనం.. రూ. 25వేల నుండి రూ.35 వేలతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
గుర్తింపు పొందిన యూనివర్సిటి నుండి డిగ్రీ ఉత్తర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానం, తెలుగు భాషలో ప్రావీణ్యం తప్పనిసరి. మైక్రో ఫైనాన్స్, రూరల్ డెవెలప్‌మెంట్ రంగాల్లో అనుభవం ఉండాలి. అభ్యర్థులు ఎపి రాష్ట్ర నివాసితులై ఉండాలి.
దరఖాస్తులను జులై 7వ తేదీ నుండి 18వ తేదీ వరకు పంపించాల్సి ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1000. పూర్తి వివరాలకు https;//sreenidhi-apamrecruitment.aptonline.in వెబ్‌సైట్ చూడగలరు.