Hyderabad: హెచ్‌సిఎ అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్‌రావు అరెస్ట్

హైద‌రాబాద్ (CLiC2NEWS): హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సిఎ) అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న‌రావును సిఐడి బుధ‌వారం అరెస్ట్ చేసింది. ఆయ‌న‌తో పాటు మ‌రొక‌రిని కూడా అదుపులోకి తీసుకుంది. గ‌త ఐపిఎల్ సీజ‌న్‌లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌-హెచ్‌సిఎ మ‌ధ్య టికెట్ల వివాదం తలెత్తింది. మ్యాచ్ టికెట్ఉల కేటాయించ‌లేద‌ని కార్పొరేట్ బాక్స్‌కు హెచ్‌సిఎ అధికారులు తాళం వేశారు. దీంతో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజ‌మాన్యం తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది. హైద‌రాబాద్‌న వెళ్లి పోతామని పేర్కొంది. ఈ క్ర‌మంలో హెచ్‌సిఎ అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న‌రావు పై ఎస్ ఆర్ హెచ్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం విజిలెన్స్ విచార‌ణ‌కు ఆదేశించింది. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్రాంజైజిపై హెచ్‌సిఎ అధ్య‌క్షుడు ఒత్తిడి తెచ్చిన‌ట్ఉల విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. ఆ నివేదిక ఆధారంగా సిఐడి కేసు న‌మోదు చేసింది. ఈ క్ర‌మంలో నేడు జ‌గ‌న్మోహ‌న‌రావును అరెస్ట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.