Zaheerabad: ఎసిబి వలలో నిమ్జ్ అధికారులు..
జహీరాబాద్ (CLiC2NEWS): డిప్యూటి కెలక్టర్, డిప్యూటి తహసీల్దార్..లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో చోటు చేసుకుంది. జహీరాబాద్లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్) అధికారులు రూ.65 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి రెడ్ హ్యాండెడ్గా పట్టబడ్డారు. డ్రైవర్ వద్ద నగదును స్వాధీనం చేసుకున్నారు.