AP: మెగా పేరెంట్ టీచ‌ర్‌ మీటింగ్‌..

అమ‌రావ‌తి (CLiC2NEWS): రెండు కోట్ల మందితో పేరెంట్ టీచింగ్ మీటింగ్ (మెగా పిటిఎం- 2.0).. ఎపిలోని శ్రీ స‌త్య‌సాయి జిల్లా కొత్త చెరువు జ‌బ్పి పాఠ‌శాల‌లో గురువారం త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా స‌మావేశాన్ని ప్ర‌భుత్వం నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, త‌ల్లిదండ్రులు, పాఠ‌శాల యాజ‌మాన్య క‌మిటీలు, ఉద్యోగులు, అధికారులు, దాత‌లు, పూర్వ విద్యార్థులు.. ఒకే రోజు రెండు కోట్ల మందితో మెగా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో సిఎం చంద్ర‌బాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. సిఎం ఉపాధ్యాయుడిగా విద్యార్థుల‌కు పాఠాలు బోధించ‌గా.. లోకేశ్ విద్యార్థుల‌తో క‌లిసి పాఠాలు విన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాగా ప‌నిచేస్తున్నార‌ని ఈ సంద‌ర్బంగా సిఎం కితాబిచ్చారు. విద్యార్ధుల మార్కుల‌పై ఆరా తీశారు.

 

Leave A Reply

Your email address will not be published.