కారులో 110 కిలోల వెండి బిస్కెట్లు..

భువ‌నేశ్వ‌ర్ (CLiC2NEWS): అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న 110 కిలోల వెండి బిస్కెట్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ‌డిశాలోని సంబ‌ల్ పూర్ జిల్లా రెంగాలి త‌హ‌సీల్ద‌ర్ కార్యాల‌యం స‌మీపంలో ఓ కారులో వెండి బిస్కెట్లు ఉన్న‌ట్లు గుర్తించారు. ఈ బిస్కెట్ల‌ను ఝ‌ర్ఖండ్ రాజ‌ధాని రాంచీకి త‌ర‌లిస్తున్న‌ట్లు స‌మాచారం. వెండి బిస్కెట్ల‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వెండి బిస్కెట్ల విలువ సుమారు రూ.1.10 కోట్లు ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.