Vizag: హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 47 పోస్టులు
HSL: విశాఖపట్నం, హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్)లో 47 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. టిక్నికల్, సబ్‌మెరైన్, సివిల్ హెచ్ ఆర్, సెక్యూరిటి, కార్పొరేట్ కమ్యూనికేషన్ , డిజైన్, లీగల్, బిజినెస్ విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. దరఖాస్తులను ఆగస్టు 9వ తేదీలోపు పంపించాల్సి ఉంది. దరఖాస్తు ఫీజు జనరల్, ఒబిసి, ఇడబ్ల్యుఎస్‌లకు రూ.300 .. ఎస్‌సి, ఎస్‌టి , పిహెచ్‌లకు ఫీజు లేదు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
మేనేజర్ (టెక్నికల్ )
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2025 ఆగస్టు 9 వ తేదీ నాటికి 40ఏళ్లు ఉండాలి.
మేనేజర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.60వేల నుండి రూ.1,80,000వ రకు అందుతుంది.
ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ (టెక్నికల్) -2
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి వయస్సు 57 ఏళ్ల లోపు ఉండాలి.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు వేతనం రూ. 1,70,000 వరకు అందుతుంది.
డిప్యూటి ప్రాజెక్ట్ ఆఫీసర్ (టెక్నికల్) -14
డిప్యూటి ప్రాజెక్ట్ ఆఫీసర్ (సబ్‌మెరైన్) -9
డిప్యూటి ప్రాజెక్ట్ ఆఫీసర్ (సివిల్) -3
డిప్యూటి ప్రాజెక్ట్ ఆఫీసర్ (హెచ్ ఆర్) – 6
డిప్యూటి ప్రాజెక్ట్ ఆఫీసర్ (సెక్యూరిటి)- 1
డిప్యూటి ప్రాజెక్ట్ ఆఫీసర్ (కార్పొరేషన్ కమ్యూనికేషన్) – 1
డిప్యూటి ప్రాజెక్ట్ ఆఫీసర్ (డిజైన్) -2
పై పోస్టుకలు ఆప్లై చేసుకునే వారు 40 నుండి 45 ఏళ్ల లోపు వారై ఉండాలి
ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ.73 వేలు వరకు ఉంటుంది.
సీనియర్ కన్సల్టెంట్ (డిజైన్) -1
సీనియర్ కన్సల్టెంట్ (లీగల్)-1
సీనియర్ కన్సల్టెంట్ (బిజినెస్ & వెండర్ డెవలప్‌మెంట్ ) -1
పై పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 62 ఏళ్లకు మించకూడదు.
ఎంపికైన వారికి నెలకు వేతనం రూ. 1,20,000 వరకు అందుతుంది
కన్సల్టెంట్ (సబ్‌మెరైన్) -2
కన్సల్టెంట్ (ఢిల్లీ ఆఫీస్ )-1
అభ్యర్థుల వయస్సు 62 ఏళ్ల లోపు ఉండాలి.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి వేతనం నెలకు రూ.లక్ష ఉంటుంది.
పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ, బిటెక్ / బిఇ, ఎల్ ఎల్ బి, పిజి డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి.