ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీ, మెద‌క్‌లో టెక్నీషియ‌న్ పోస్టులు

ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీ, మెద‌క్‌లో వివిధ విభాగాల్లో టెక్నీషియ‌న్‌, జూనియ‌ర్ టెక్నీషియ‌న్ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. టెక్నీషియ‌న్ -35.. జూనియ‌ర్ టెక్నీషియ‌న్ -33 పోస్టులు క‌ల‌వు. ఈ పోస్టుల‌ను ఒప్పంద ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేసేందుకు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు.

సిఎన్‌సి ఆప‌రేట‌ర్‌, మెషినిస్ట్‌, మిల్ల‌ర్‌, ఫిట్ట‌ర్ జ‌న‌ర‌ల్ విభాగాల్లో టెక్నీషియ‌న్ పోస్టుల‌కు డిప్లొమా, ఎన్ ఎసి/ ఎన్‌టిసితో పాటు ప‌ని అనుభ‌వం అవ‌స‌రం. అభ్య‌ర్థుల వ‌య‌స్సు 18-30 ఏళ్లు మ‌ధ్య ఉండాలి. షార్ట్ లిస్ట్ , ట్రేడ్ టెస్ట్‌ల‌తో ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్య‌ర్థుల‌లో డిప్లొమా టెక్నీషియ‌న్‌ల‌కు రూ.23 వేలు.. జూనియ‌ర్ టెక్నీషియ‌న్‌కు రూ.21 వేలు వేత‌నం అందుతుంది.

వెల్డ‌ర్‌, మెషినిస్ట్ , ఫిట్ట‌ర్ ఎల‌క్ట్రిక్ , ఫిట్ట‌ర్ జ‌న‌ర‌ల్ , మిల్‌రైట్ విభాగంలో జూనియ‌ర్ టెక్నీషియ‌న్ పోస్టులకు ప‌దో త‌ర‌గ‌తి, ఎన్ ఎసి/ ఎన్ టిసితో పాటు ప‌ని అనుభ‌వం అవ‌స‌రం. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌స్సు 64 ఏళ్ల‌కు మించ‌రాదు.

ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు వేత‌నం రూ. 30వేలు అందుతుంది.

ద‌ర‌ఖాస్తుల‌ను జులై 21వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. డిప్యూటి జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌/ హెచ్ ఆర్‌, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్ట‌రీ మెద‌క్‌, ఎద్దుమైలారం, సంగారెడ్డి జిల్లా , తెలంగాణ -502205 చిరునామాకు ద‌ర‌ఖాస్తుల‌ను ఆఫ్‌లైన్‌లో పంపించాలి.

Leave A Reply

Your email address will not be published.