భార‌త్ డైన‌మిక్స్ లిమిటెడ్‌లో 212 పోస్టులు

BDL: భార‌త్ డైన‌మిక్స్ లిమిటెడ్ (బిడిఎల్) హైద‌రాబాద్ యూనిట్ తెలంగాణ‌లోని ప‌లు విభాగాల్లో 212 పోస్టుల‌ను ఒప్పంద ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేయ‌నున్న‌ది. ట్రెయినీ ఇంజినీర్ , ట్రెయినీ ఆఫాస‌ర్‌, డిప్లొమా అసిస్టెంట్ , ట్రెయినీ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీ ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ద‌ర‌ఖాస్తుల‌ను ఆగ‌స్టు 10వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. రాత ప‌రీక్ష ఆధారంగా ఉద్యోగాల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

విభాగాలు.. ఎల‌క్ట్రానిక్స్‌, మెకానికల్, ఎల‌క్ట్రిక‌ల్, కంప్యూట‌ర్ సైన్స్‌, హెచ్ ఆర్‌, ఫైనాన్స్‌, బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్
అర్హ‌త: పోస్టును అనుస‌రించి డిప్లొమా, డిగ్రీ.

వ‌య‌స్సు: 10.08.2025 నాటికి 28 నుండి 33 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్‌సి, ఎస్‌టిల‌కు 5ఏళ్లు.. ఒబిసిల‌కు 3 ఏళ్లు.. స‌డ‌లింపు వ‌ర్తిస్తుంది.

వేత‌నం : ట్రెయినీ ఇంజినీర్ , ఆఫీస‌ర్‌గాఎంపికైన‌ వారికి నెల‌కు వేత‌నం రూ. 29 వేల నుండి రూ. 38 వేల వ‌ర‌కు ఉంటుంది.

అసిస్టెంట్‌, ట్రెయినీ అసిస్టెంట్ల‌కు రూ. 24,500 నుండి రూ 29,500 వ‌ర‌కు జీతం ల‌భిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.