Supreme Court: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి..
న్యూఢిల్లీ (CLiC2NEWS): తెలంగాణ(Telangana)లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు(Supreme Court) కీలక తీర్పును వెలువరించింది. ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై గురువారం అత్యున్నత ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు (High Court) డివిజన్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్‌ను ధర్మాసనం కొట్టివేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3నెలలలోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం సిజె జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.. పార్టీ ఫిరాయించిన శాసన సభ్యులపై న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో పార్లమెంటు చట్టం తీసుకురావాలని అభిప్రాయపడింది.
తెలంగాణ(Telangana)లో పార్టీ మారిన 10 మంది శాసన సభ్యులను అనర్హులుగా ప్రకటించాలంటూ సుప్రీం కోర్టు(Supreme Court)లో బిఆర్ ఎస్ నాయకులు కెటిఆర్ (ktr), పాడికౌశిక్‌రెడ్డి, కెపి వివేకానంద, జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తప్పకచదవండి: రష్యా, జపాన్ ను తాకిన సునామీ
I believe everything said was actually very logical. However, what about this?
suppose you added a little content? I mean, I don’t want to tell you
how to run your blog, however suppose you added something
to possibly grab a person’s attention? I mean Decision on defecting MLAs should
be taken within 3 months: is a little plain. You could peek at Yahoo’s home page and watch how they create post
headlines to grab people to click. You might try adding a video
or a pic or two to grab readers excited about everything’ve got to say.
In my opinion, it could make your blog a little bit more interesting.