Hyderabad: జలమండలిలో ఘనంగా ప్రొ.జయశంకర్ జయంతి
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని జలమండలి కార్యాలయంలో ప్రొ.జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జలమండలి ఎండి అశోక్ రెడ్డి జయశంకర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళుల అర్పించారు.
తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిప్రధాత అయిన ప్రొ.జయశంకర్ జయంతి వేడుక ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగింది. జలమండలి ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జలమండలి ఈఎన్సీ, డైరెక్టర్ ఆపరేషన్స్- 2 ప్రవీణ్ కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్, ఫైనాన్స్ డైరెక్టర్ పద్మావతి, పర్సనల్ డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్, సీజీఎంలు, జీఎంలు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Also Read: Ramagundam: ప్రొ. జయశంకర్ జయంతి వేడుకలు