హైద‌రాబాద్‌లో స్థ‌లం ఉన్న‌వారికి ఇందిర‌మ్మ ఇళ్లు .. పొంగులేటి

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలో ఇళ్ల స్థ‌లాలు ఉన్న వారికి నెలాఖ‌రులోపు ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు చేస్తామ‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా జూన్ 2న ఇందిర‌మ్మ ఇళ్ల రెండో విడ‌త పంపిణీ ప్రారంభించ‌నున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఆదిలాబాద్‌లో ప్రారంభించ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. దీనికి సంబంధించిన విధి విధానాల‌ను ఈ నెల 21న జ‌రిగే మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఖ‌రారు చేస్తామ‌ని మంగ‌ళ‌వారం గృహ నిర్మాణ శాఖ అధికారుల‌తో జ‌రిగిన స‌మావేశంలో తెలియ‌జేశారు.

ఇందిర‌మ్మ ఇళ్ల కోసం స్థ‌లాలు గుర్తించి ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేయాల‌ని మంత్రి ఆదేశించారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ను ల‌బ్ధిదారుల‌కు ఇచ్చేందుకు స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించాల‌ని అన్నారు.

Also Read:  నిశ్శబ్ద సేవకురాలు.. నర్సు

Leave A Reply

Your email address will not be published.