ఆ వార్తల్లో నిజం లేదు.. చిరంజీవి
హైదరాబాద్ (CLiC2NEWS): సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంపై జరుగుతున్న చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్.. ఇకపై ఎలాంటి చిత్రీకరణలు చేయొద్దని నిర్మాతలకు కఠిన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తన సినిమా షూటింగ్ కార్మికులకు వేతనం పెంచి ఇస్తామని మెగాస్టార్ చిరంజీవి హామీ ఇచ్చారంటూ వస్తున్న వార్తలను చిరంజీవి ఖండించారు. శనివారం తనను సినీ కార్మికులు కలిశారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులలో కొంతమంది వ్యక్తులు తనను కలిశారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. వారికి 30%వేతన పెంపు వంటి డిమాండ్లను తాను అంగీకరించినట్లు ప్రకటనలు చేయడం తన దృష్టి వచ్చింది. నేను ఫెడరేషన్ కి చెందిన ఎవరినీ కలవలేదన్నారు. నేను ఎవ్వరికీ హామీ ఇవ్వలేదన్నారు. అన్ని వర్గాలతో చర్చలు జరిపి, న్యాయ సమ్మతమైన పరిష్కారానికి రావడం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దే బాధ్యత అని చిరంజీవి అన్నారు. అంతవరకూ ఎటువంటి నిరాధారమైన ప్రకటనలను తాను ఖండిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
Also Read: షూటింగ్స్ ఆపండి.. నిర్మాతలకు ఆదేశాలు
[…] Also Read: ఆ వార్తల్లో నిజం లేదు.. చిరంజీవి […]
[…] Also Read: Cinema News: ఆ వార్తల్లో నిజం లేదు.. చిరంజీవి […]