హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వాన..
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో శనివారం సాయంత్రం నుండి భారీ వర్షం కురుస్తుంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇవాళ రక్షాబంధన్ పండుగ కావడంతో ప్రయాణాలు చేస్తున్న వారు ఇబ్బందులకు గురయ్యారు. హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. శనివారం సాయంత్రం మూడు గంటలుగా వర్షం కురుస్తూనే ఉండటంతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కుంటున్నారు. మ్యాన్ హోల్స్ వద్ద చెత్త పేరుకుపోయి రోడ్లపై నీరు నిల్వఉండి పోతుంది. దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నగరంలోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైతే తప్ప ఇండ్లనుండి బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.
Also Read: Cinema News: ఆ వార్తల్లో నిజం లేదు.. చిరంజీవి
[…] Also Read: హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వాన.. […]