దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నాం: మంత్రి ఉత్తమ్
ఏటూరు నాగారం (CLiC2NEWS): దేవాదుల ప్రాజెక్టు తమ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైనదని భట్టి విక్రమార్క చెప్పారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా దేవాదుల పంపుహౌస్‌ను రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌తో కలిసి డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. అక్కడ కొనసాగుతున్న పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటి సిఎం మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు తమ ప్రభుత్వానికి ముఖ్యమన్నారు. (ములుగు జిల్లా , ఏటూరు నాగారం మండలం దేవాదుల, గంగారం గ్రామాల వద్ద ఈ ప్రాజెక్టు నిర్మితమవనున్నది.) దీని నిర్మాణానికి భూసేకరణ నిమిత్తం రూ. 67 కోట్లు అవసరమవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. పెండింగ్ బిల్లులు కూడా త్వరలో మంజూరు చేయనున్నట్లు ఈ సందర్బంగా డిప్యూటి సిఎం తెలిపారు.
అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఈ ప్రాజెక్టు కారణంగా ముంపుకు గురయ్యే ప్రాంతాలైన ఛత్తీస్‌గఢ్‌లోని ముంపు ప్రాంతాలకు పరిమారం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. భూసేకరణ పై జిల్లాల కలెక్టర్లు త్వరగా చర్యలు చేపట్టాలని సూచించారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టును కట్టి తీరుతామని మంత్రి ఈ సందర్బంగా తెలిపారు.
దేవాదుల ప్రాజెక్టు:
దేవాదుల ఎత్తిపోతల పథకానికి 2008 జూన్‌లో పనులు చేపట్టారు. ఈ పనులకు 2007లో రూ.1,387కోట్లతో పరిపాలనా అనుమతి లభించింది. కాగా.. వాటిని రూ.1,410 కోట్లకు హెచ్‌సిసి మరో ఇద్దరు గుత్తేదారులు కలిసి దక్కించుకున్నారు. ఈ ప్రాజెక్టు పనులు మూడు దశల్లో చేపట్టారు. వారి ఒప్పందం ప్రకారం 2011లో ఏడాది చివరికి ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ.. కేవలం రూ.281 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి.
సొరంగం తవ్వే పనికి 8 కిలో మీటర్ల దూరం అటవీ భూమి అప్పగించడంలో జరిగిన కాలయాపన.. సొరంగం తవ్వే సమయంలో భారీగా ఊట రావడం.. సాలివాగు చెరువుకు గండిపడి వచ్చిన నీటితో సొరంగం పనులు నిలిచిపోయాయి.
అనంతరం 2017 నాటి ప్రభుత్వం కొన్ని మార్పులు, చేర్పులు చేసి 1,495 కోట్లతో పరిపాలన అనుమతి నిచ్చింది. అనంతరం ఈ పని విలువ రూ.1,680 కోట్లకు చేరింది. కానీ పనులు మాత్రం పూర్తి కాలేదు. ఈ క్రమంలో దేవాదుల ఎత్తపోతల మొత్తం పని విలువ రూ.13,445 కోట్లకు చేరింది. అంటే.. మొదట అనుకున్నదానికంటే వంద శాతం వ్యయం పెరిగింది.
Also Read: Hyderabad Rain: నడుములోతు నీరు…
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
cabe4d
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
rimbatoto
Thanks very nice blog!
Hello to every body, it’s my first visit of this web site; this website includes amazing and actually excellent stuff in support of readers.
I always spent my half an hour to read this weblog’s articles daily along with a mug of coffee.