ఏ భావోద్వేగాన్నైనా ప‌లికించ‌గ‌ల న‌టుడు ఎన్‌టిఆర్: త్రివిక్ర‌మ్

హైద‌రాబాద్ (CLiC2NEWS): అయాన్ ముఖ‌ర్జి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం వార్2. ఈ చిత్రంలో హృతిక్‌తో పాటు జూనియ‌ర్ ఎన్‌టిఆర్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కియారా అడ్వాణి హీరోయిన్ . ఈ సినిమా ఆగ‌స్టు 14వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ప్రి-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ వెంట్‌కు హాజ‌రైన మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట్లాడుతూ..

ఎన్‌టిఆర్, హృతిక్.. మెరుపు తీగ‌ల్లా ఉన్న వారిని ఒకే తెర‌పై చూడ‌డానికి రెండు క‌ళ్లూ చాల‌వ‌ని అన్నారు. వారిద్ద‌రూ వింధ్య , హిమాచ‌ల ప‌ర్వ‌తాల్లాంటి వార‌ని, వారు క‌లిసి న‌టించిన చిత్రం త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుందని అన్నారు.

ఎన్‌టిఆర్ బంగారం లాంటి వార‌ని.. ఎన్‌టిఆర్ ఏ భావోద్వేగాన్నైనా ప‌లికించ‌గ‌ల న‌టుడు అన్నారు. ద‌ర్శ‌కుడు అయాన్‌కు బంగారాన్ని ఎలా తెలిసిన‌వాడ‌న్నారు. అందుకే ఎన్‌టిఆర్ కోసం ఇక్క‌డి దాకా వ‌చ్చార‌న్నారు. ఇది కేవ‌లం యాక్ష‌న్ సినిమా మాత్ర‌మే కాద‌ని.. అంత‌కు మించి ఉంటుద‌న్నారు. ఈ సారి వినాయ‌క చ‌వితికి వార్2 చిత్రంలోని పాట విన‌ప‌డుతూనే ఉంటుంద‌న్నారు.

 

Job News: బిటెక్ అర్హ‌త‌తో ఆర్మీలో లెప్ట్‌నెంట్ హోదాతో పోస్టులు..

2 Comments
  1. […] Also Read: ఢిల్లీ-వాషింగ్ట‌న్: ఎయిరిండియా స‌ర్వ… […]

Leave A Reply

Your email address will not be published.