ఎపిలో ఉచిత బస్సు షురూ
విజయవాడ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నేడు నెరవేర్చింది. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎపి ప్రభుత్వం చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సిఎం చంద్రబాబు విజయవాడలోని పండి్ నెహ్రూ బస్టాండ్ వద్ద స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ , ఆర్టిసి ఎండి ద్వారకా తిరుమల రావు, ఎంపిలు, ఎమ్మెల్యేలు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవం నాడు స్త్రీ శక్తి పథకాన్ని శ్రీకారం చుట్టామని, మహిళలకు మేలు చేస్తున్నందుకు తృప్తిగా ఉందన్నారు. రాష్ట్రంలోని 2.6 కోట్ల మందికి పైగా మహిళలకు లబ్ధి కలుగుతుందన్నారు. ఆర్టిసి కండక్టర్లుగా మహిళలను ముందుగా తీసుకున్నది మేమే నని ఈ సందర్బంగా గుర్తుచేశారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజలు నవ్వడమే మరిచిపోయారని, ఆడబిడ్డలకు మహర్ధశ వచ్చే వరకు అండగా ఉంటామని సిఎం అన్నారు.
Also Read: ఐదేళ్ల విశ్వాసం.. clic2News ప్రయాణం!

[…] ఎపిలో ఉచిత బస్సు షురూ […]