ఐదేళ్ల విశ్వాసం.. clic2News ప్రయాణం!
clic2news 5వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది! 2020లో ప్రారంభమైన ఈ న్యూస్ ప్లాట్‌ఫారమ్, విశ్వసనీయ సమాచారం.. పాఠకుల విశ్వాసంతో ఈరోజు (15)తో ఐదేళ్ల మైలురాయిని చేరుకుంది.
ఒక కల సాకారం
ఈ రోజు clic2news.com కి ఒక విశేషమైన రోజు.
2020 ఆగస్టు 15న చిన్న కలతో ప్రారంభమైన clic2news.com.. విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మనందరం కలసి నడిచిన ఈ ప్రయాణం.. మీ ప్రేమ, విశ్వాసం, ప్రోత్సాహం వల్లే సాధ్యమైంది.
“no favour, no fear” అనే నమ్మకంతో, నిజమైన వార్తలను పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.
ప్రయాణం..
- 2020: clic2news.com చిన్న బ్లాగ్‌గా ప్రారంభం, వార్తలు, ఆర్టికల్స్ పంచుకోవడం.
- 2021–2022: పాఠక లోకంలో గుర్తింపు, సోషల్ మీడియాలో విస్తరణ. కేటగిరీ ఆధారిత వార్తలు (రాజకీయాలు, ఒక్కమాట, క్రీడలు, బిజినెస్, సినిమా, గెస్ట్ కాలమ్స్ తదితరాలు).
- 2023: ప్రత్యేక కేటగిరీలు, స్పీడ్ అప్‌డేట్స్, ఫ్యాక్ట్ చెకింగ్ కంటెంట్.
- 2024: పాఠకుల అభిరుచులకు తగ్గ న్యూస్ ప్రెజెంటేషన్, లోతైన విశ్లేషణలు.
- 2025: 5వ వార్షికోత్సవం.. పాఠకుల సూచనల ఆధారంగా కంటెంట్ మెరుగుదల… న్యూస్ మాత్రమే కాదు, ఒక నమ్మకం!
మా లక్ష్యం
ఒక్కమాట అంటూ లక్ష ఆలోచనలను రేకెత్తించేదే CLiC2NEWS..
చూపుడు వేలు స్పష్టత చిహ్నమై వార్తా సమాహారమవుతున్నది..
“నాలుగు దిక్కులు నావేనని.. ఒక్క దృక్కోణమేలనోయి..
పలు దృక్పధాలు మనవోయి.. పరిపరివిధాల ప్రపంచ కిటికీలు తెరువోయి..“
CLiC2NEWS ఈ కొత్త భావాల్ని భుజానమోస్తూ అరచేతిలో అద్భుతాలను పెడుతున్నది.
తనదైన ముద్రతో ‘no favour, no fear’ అనే సూత్రాలపై నడుస్తున్నది. సూత్రప్రాయంగా సమవీక్షణం చేయిస్తున్నది.
దోహదమేదో, దోపిడీ ఏదో.. వ్యాపార విశేషాలుగా మీ ముందు కుప్పబోస్తున్నది. ‘CLiC2NEWS’అంటేనే ప్రపంచాన్ని దోసిటబట్టే వార్తా సమాహార పాత్ర వంటిదవుతున్నది.
clic2news.com ఎప్పుడూ “సమాచారాన్ని నిజంగా, సమయానికి” అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
మీరు ఎక్కడ ఉన్నా, నిజమైన సమాచారాన్ని ఒక్క క్లిక్‌తో అందించడంలో మేము తగ్గిపోము.
పాఠకులకు ధన్యవాదాలు
మీరు మమ్మల్ని చదవడం, షేర్ చేయడం, సూచనలు ఇవ్వడం – ఇవన్నీ మాకు మరింత ప్రోత్సాహం ఇస్తున్నాయి.
ఈ 5 ఏళ్ల ప్రయాణం మీ మద్దతు, విశ్వాసం వల్లే సాధ్యమైంది.
clic2news.com మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.
మన ప్రయాణం కొనసాగుతుంది…
మీ విశ్వాసమే మా బలమైన శక్తి!
-ఎడిటర్

[…] Also Read: ఐదేళ్ల విశ్వాసం.. clic2News ప్రయాణం! […]