ఐఐసిటి, హైదరాబాద్లో మల్టిటాస్కింగ్ స్టాఫ్
IICT: నగరంలోని సిఎస్ఐఆర్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజి (IICT)లో ఖాళీగా ఉన్న 9 పోస్టులు భర్తీ చేయనున్నారు.
స్టెనోగ్రాఫర్ పోస్టులు – 1, మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్టులు -8 కలవు.
రాత పరీక్ష, స్టెనోగ్రాఫీ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను వచ్చే నెల 12వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. (12.09.2025)
దరఖాస్తు ఫీజు: రూ. 500గా నిర్ణయించారు. ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యుబిడి, మహిళలకు , ఎక్స్ సర్వీస్మెన్లకు ఫీజు లేదు.
పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగానుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
స్టెనో గ్రాఫర్ పోస్టుకు ఎంపికైన వారకి నెలకు వేతనం రూ. 52,755 వరకు అందుతుంది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 27 ఏళ్లకు మించకూడదు.
మల్టి టాస్కింగ్ స్టాప్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు వేతనం రూ. 35,393 వరకు ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 25 ఏళ్లకు మించకూదడు.
[…] […]