ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌కు మద్దతివ్వండి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ (CLiC2NEWS): ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ (Radhakrishnan)కు మద్దతివ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల ఏకగ్రీవంగా జరిగేందుకు విపక్ష పార్టీలు సహకరించాలని ప్రధాని కోరారు..
కాగా ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.. ఈ ఎన్నికలో భాగంగా ఎన్డీయే అభ్యర్థి ఎన్నికపై బిజెపి తీవ్ర కసరత్తు చేసి తమిళనాడుకు చెందిన, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌ను ఎంపిక చేసింది.
మంగళవారం ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంటులోని బాలయోగి ఆడిటోరియంలో జరిగిన ఈ సమావేశంలో సిపి రాధాకృష్ణన్‌ను ప్రధాని మోడీ ఎన్డీయే ఎంపీలకు పరిచయం చేశారు. అనంతరం రాధకృష్ణన్‌ను ప్రధాని, కేంద్ర మంత్రులు సన్మానించారు.
ఈ భేటీ అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు.. రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతిగా ఏకగ్రీవ ఎన్నికకు విపక్ష పార్టీలు సహకరించాలని ప్రధాని (modi)కోరినట్లు ఆయన తెలిపారు.
కాగా బుధవారం రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయే కూటమికి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే మెజారిటి ఉన్నందున్న తమిళనాడుకు చెందిన సిపి రాధకృష్ణన్ (67) ఎంపిక లాంచనమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఎన్‌డిఎ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు
Participated in the NDA Parliamentary Party Meeting in Delhi this morning. Happy to see the enthusiasm in favour of Thiru CP Radhakrishnan’s candidature for the Vice Presidency.@CPRGuv pic.twitter.com/87Gkwr2pLO
— Narendra Modi (@narendramodi) August 19, 2025

[…] […]