Hyderabad-Amravati: గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే
హైదరాబాద్ (CLiC2NEWS): గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే (Greenfield Express Highway)తో హైదరాబాద్ నుండి విజయవాడకు ప్రయాణ సమయం తగ్గనుంది. రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలకు మధ్య సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణానికి వీలుగా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుండి విజయవాడకు 70 కిలోమీటర్లు దూరం తగ్గనుంది. హైదరాబాద్ – అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్రం అనుమతినిచ్చింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల అధికారులు హైవేకు సంబంధించిన డిపిఆర్ సిద్దం చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలు కేవలం రెండు గంటలలోపే తమ గమ్యస్తానాలకు చేరుకనే వెసులుబాటు కలుగనుంది.
Also Read: హైకోర్టులో మజి సిఎం కెసిఆర్ పిటిషన్
[…] […]