Megastar: ‘విశ్వంభర’ నుండి గ్లింప్స్ రిలీజ్
హైదరాబాద్ (CLiC2NEWS): విశ్వంభర చిత్రం గ్లింప్ గురువారం సాయంత్రం విడుదల చేస్తామని మెగాస్టార్ చిరంజీవి తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా సినిమా గ్లింప్స్ (Glimpse)ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమా విడుదల ఆలస్యానికి గల కారణాలను చిరంజీవి తెలిపారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయిందని, విఎఫ్ ఎక్స్ పనులు జరుగుతున్నట్లు తెలియజేశారు. ఈ చిత్రంలో మెగాస్టార్ తో పాటు త్రిష , ఆషికా రంగనాథ్ నటించారు. బాలీవుడ్ తార మౌనీరాయ్ ప్రత్యేక గీతంలో ప్రేక్షకులను అలరించనున్నారు.
Cinema News: ‘విశ్వంభర’: స్పెషల్ వీడియో విడుదల చేసిన మెగాస్టార్