Mandapet: ‘జన జాగృతి రథం’ ద్వారా చట్టాలపై అవగాహన
మండపేట (CLiC2NEWS): జిల్లాలో మొదటిసారిగా మండపేట మండలం జెడ్ మేడపాడు సెంటర్లో ఆదివారం జన జాగృతి రథం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలొ ఎస్‌పి బి కృష్ణారావు జన జాగృతి రథం కార్యక్రమం ప్రారంభించారు. జన జాగృతి రథం ద్వారా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమంలో రామచంద్రపురం ట్రైని డిఎస్‌పి ప్రదీప్తి రూరల్ ఎస్ఐ వి కిషోర్ తో కలిసి ఈ కార్యక్రంలో పాల్గొన్నారు.
జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజల్లో మాదకద్రవ్యాల వాడకాన్ని నివారించే చర్యలు, సైబర్ నేరాలపై జాగ్రత్తలు, మహిళల పట్ల గౌరవంగా నడుచుకోవడం వంటి అంశాలపై ఈ రథం ద్వారా అవగాహన కల్పిస్తామని వివరించారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగిఉండాలన్నారు. చట్ట విరుద్ధమైన పనులకు దూరంగా ఉండాలని ప్రదీప్తి అన్నారు. ఈ రథం ద్వారా అందించే సందేశాలను ప్రజలు గమనించి, నేరాల నుండి దూరంగా ఉండాలని డిఎస్‌పి పిలుపునిచ్చారు.