విజయ్ ర్యాలీలో తొక్కిసలాట
8 మంది పిల్లలు, 16 మంది మహిళలు సహా 39 మంది మృతి
కరూర్ (CLiC2NEWS): తమిళనాడులోని కరూర్‌లో సినీ నటడు, టివికె అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది పిల్లలు, 16 మంది మహిళలు సహా 39 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
కరూర్ సమీపంలోని వేలుసామిపురంలో శనివారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో విజయ్ ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అభిమానులు విజయ్ కు అతి దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థతి చోటుచేసుకుంది. ఈ ఘటనలో 39 మంది మరణించినట్లు తమిళ నాడు సర్కార్ ప్రకటించింది.
ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసిన స్టాలిన్ సర్కార్
తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. కరూర్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సూచించారు.
మృతులకుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున , గాయపడిన వారికి లక్ష రూ. చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
ఈ ఘటనపై విచారణ కోసం హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు ఏస్తున్నట్లు ప్రకటించారు.
ఈ ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు.
Also Read: Hyderabad: ముంచేసిన మూసీ (photos)
[…] విజయ్ ర్యాలీలో తొక్కిసలాట […]