జైల్లో డిగ్రీ చదువుకుని బంగారు పతకం సాధించిన మహిళా ఖైదీ
రాజమహేంద్రవరం (CLiC2NEWS): జీవితంలో ఎక్కడ ఉన్నా చదువు ద్వారా మార్పును సాధించడం చాలా ముఖ్యమైంది. ఆశయం కోసం నిరంతరం కృషి చేసినప్పుడు అనుకున్న కల సాకారమవుతుంది. చదవుకోవాలనే మనసుంటే ఎక్కడ ఉన్నా అనుకున్న లక్ష్యాన్ని నేరవేర్చుకోవచ్చు. దీనికి నిదర్శనం ఈ ఘటన.
రామహేంద్రవరం కేంద్ర మహిళా కారాగారంలో ఖైదీగా ఉంటూ డిగ్రీ పట్టా సాధించడమే కాకుండా ఏకంగా బంగారు పతకాన్ని సాధించింది. వివరాల్లోకి వెళ్తే… గుంటూరు జిల్లాకు చెందిన డి నాగరాజకుమారి ఒక హత్య కేసులో జీవిత ఖైదీ శిక్ష పడి 2020లో రాజమహేంద్ర వరం జైలుకు వచ్చారు. ఖైదీగా శిక్ష అనుభవిస్తూనే అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు.
2025 ఫిబ్రవరిలో బెయిలు పై ఆమె విడుదలయ్యారు. కాగా రాజకుమారికి బంగారు పతకం వచ్చిందని వర్సిటీ ప్రతినిధులు జైలు అధికారులకు సమాచారం రావడంతో.. ఈ విషయాన్ని నాగరాజకుమారికి తెలియజేయగా సంతోషించారని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ఈ నెల 30న జరిగే స్నాతకోత్సవంలో ఆమె బంగారు పతకాన్ని అందుకోనున్నారు.
బంగారు పతకం రావడం పట్ల నాగరాజకుమారి సంతోషం వ్యక్తం చేశారు. ఇది జైలు అధికారుల ప్రోత్సాహం వల్లే సాధ్యమైందని తెలిపారు.
కాగా ఇప్పటి వరకు రాజమహేంద్రవరం జైలు నుంచి 32 మంది ఖైదీలు డిగ్రీ, ఇద్దరు పీజి పూర్తి చేశారని జైలు పర్యవేక్షన అధికారి వసంత తెలిపారు.
Also Read : విజయ్ ర్యాలీలో తొక్కిసలాట
[…] […]