సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో 2,861 ఎస్ఐ పోస్టులు
ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో భారీగా సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మెత్తం పోస్టులు 2,861 కలవు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఈ నెల 16వ తేదీలోపు పంపించాల్సి ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100 ఉంది. ఎస్‌సి, ఎస్‌టి, ఎక్స్ సర్వీసెమెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
పరీక్ష.. నవంబర్- డిసెంబర్‌లో ఉండవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పిఎస్‌టి), ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పిఇటి)ల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే పురుష అభ్యర్థులు ఎత్తు 170 సెంటీమీటర్లు ఉండాలి. మహిళలు 165 సెంటీమీటర్లు ఉండాలి.
అభ్యర్థుల వయస్సు 2025 ఆగస్టు 1 వ తేదీ నాటికి 20 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సి , ఎస్‌టి లకు 5 ఏళ్లు, బిసిలకు 3 ఏళ్లు, ఇఎస్ ఎం అభ్యర్థులకు 3 ఏళ్లు సడలింపు వర్తిస్తుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు వేతనం రూ.35,400 -రూ. 1,12,400 ఉంటుంది.
[…] సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్… […]
[…] […]