ప్రొద్దుటూరులో త‌ల్లి గొంతు కోసిన కొడుకు

క‌డ‌ప‌ (CLiC2NEWS): ఎపిలోని క‌డ‌ప జిల్లాలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మంద‌లించింద‌ని క‌న్న‌త‌ల్లి గొంతుకోసాడు ఓ క‌సాయి కొడుకు. ఆదివారం ఉద‌యం ఈ ఘ‌ట‌న జిల్లాలోని ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది.

ప‌ట్ట‌ణంలోని శ్రీ‌రామ్ న‌గ‌ర్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ప‌లువురిని విస్మ‌యానికి గురిచేసింది. త‌ల్లి ల‌క్ష్మీదేవితో కుమారుడు య‌శ్వంత్ రెడ్డి గొడ‌వ‌ప‌డ్డాడు. చిన్న‌గా మొద‌లైన గొడ‌వ పెద్ద‌గా మారింది. ఈ క్ర‌మంలో తీవ్ర ఆగ్ర‌హానికి గురైన య‌శ్వంత్ తండ్రిని గ‌దిలో బంధించి.. క‌త్తితో త‌ల్లి గొం తు కోశాడు. అనంత‌రం త‌ల్లిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ఇంటి బ‌య‌ట ప‌డేశాడు.

మృతురాలు ల‌క్ష్మీదేవి ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఉపాధ్యాయురాలిగా చేస్తుంది. నిందితుడు య‌శ్వంత్ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు.

విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌ల‌కి చేరుకుని ప‌రిశీలించారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Also Read: జంట‌న‌గ‌రాల్లో బ‌స్సు భారం!

Leave A Reply

Your email address will not be published.