హిమాచల్‌లో బస్సుపై కొండచరియలు పడి 18 మంది దుర్మరణం
బిలాస్‌పూర్ (CLiC2NEWS): హిమచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బిలాస్‌పూర్ జిల్లాలో ఓ టూరిస్టు బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయి.. ఈ ప్రమాదంలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. కాగా ప్రమాద స్థలంలో బస్సులో 30-35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. స్థానికుల సాయంతో పోలీసులు, ఇతర రక్షణ సిబ్బంది శిథిలల కింద చిక్కుకున్న వారిని బయలకు తీశారు.
ప్రైవేటు టూరిస్టు బస్సు హరియాణాలోని రోహ్ తక్ నుంచి హిమాచల్ లోని ఘమర్విన్ కు బయలుదేరింది. మార్గమధ్యంలో బలూఘాట్ ప్రాంతానికి చేరుకోగానే బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో బస్సులోని వారు అధిక శాతం శిథిల కింద చిక్కుకుపోయారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
కాగా ఈ ఘటనపై సిఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై వివరాలు తెలుసుకొని సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read: బిసి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
[…] హిమాచల్‌లో బస్సుపై కొండచరియలు … […]