చైనాపై 100% సుంకాలు: ట్రంప్

వాషింగ్ట‌న్ (CLiC2NEWS): అగ్ర‌రాజ్యం మ‌రోసారి సుంకాల మోత కొన‌సాగుతోంది. అమెరికా అధ్య‌క్షుడు చైనా దిగుమ‌తుల‌పై అద‌నంగా నూరు (100) శాతం టారీఫ్‌ల‌ను విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. పెంచిన సుంకాలు వ‌చ్చేనెల () నుంచి అమ‌లులోకి రానున్నాయి.

ఈ మేర‌కు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ లో పోస్టు పెట్టారు. చైనా ఉత్ప‌త్తి చేసే వ‌స్తువులు అమెరికా దిగుమ‌తి చేసినా.. డ్రాగ‌న్ వ‌స్తువులు ఏ దేశంనుంచి అమెరికాకు వ‌చ్చినా వంద శాతం టారీఫ్‌లు ఉంటాయ‌ని వెల్ల‌డించారు.

ఈ సుంకాల‌లో ఎలాంటి మినహాయింపు ఉండ‌ద‌ని ట్రూత్ లో వెల్డించారు. చైనా త‌దుప‌రి తీసుకునే చ‌ర్య‌ల‌పై అమెరికా నిర్ణ‌యం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

కాగా అమెరికాకు ఎగుమ‌తి చేసే అరుదైన ఖ‌నిజాల‌పై చైనా ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే. ట్రంప్ నిర్ణ‌యంపై చైనా తీసుకునే నిర్ణ‌యంపై ప్ర‌పంచ దేశాలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ప్ర‌పంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల మధ్య వాణిజ్య వార్ ముదురుతుండ‌టంతో ప‌లు దేశాలు ఆందోళ‌నకు గుర‌వుతున్నాయి. ఇప్ప‌టికే రెండు దేశాల మ‌ద్య చ‌ర్చ‌లు జ‌రిగినా అవి ఓ కొలిక్కి రాలేదు. ముందు ముందు ఈ సుంకాలు ఎటు దారితీస్తాయోన‌ని చూడాలి మ‌రి.

Also Read :పంచాంగం: అక్టోబ‌రు 12 -18 (2025) 

1 Comment
Leave A Reply

Your email address will not be published.