Rangareddy: చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి
రంగారెడ్డి (CLiC2NEWS): కర్నూలు బస్సు ప్రమాదం మరువక ముందే రంగారెడ్డి జిల్లాలో మరో బస్సు ప్రమాదానికి గురైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాలగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో19 మంది ప్రాణాలు కోల్పోయారు. తాండూరు డిపోకు చెందిన ఆర్టిసి బస్సు తాండూరు నుండి హైదరాబాద్ వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కంకర లోడుతో వెళుతున్న లారీ ఢీకొట్టి బస్సు పై ఒరిగిపోయింది. దీంతో లారీలో ఉన్న కంకర మొత్తం బస్సులో పడిపోయింది. ఘటనా స్థలంలో బస్సు నుజ్జునజ్జయింది.

బస్సులోని ప్రయాణికులంతా తప్పించుకునేందుకు వీలులేకుండా కంకరలో కూరుకుపోయారు. కంకరలో కూరుకుపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికు లు మృతి చెందగా.. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
Also Read: ఇంటర్మీడియట్ అర్హతతో రైల్వేస్‌లో భారీగా పోస్టులు
[…] Rangareddy: చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్ర… […]