ఇంటర్మీడియట్ అర్హతతో రైల్వేస్‌లో భారీగా పోస్టులు
రైల్వేస్‌లో 3,058 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన బోర్డ్ నుండి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 2026 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నుండి 30 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ నవంబర్ 27.
కంప్యూటర్ బేసిడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షతో పోస్టులకు ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు రూ. 500 గా ఉంది. ఎస్‌సి, ఎస్‌టి, ఎక్స్ సర్వీస్‌మెన్, పిడబ్ల్యుబిడి, మహిళలు, ట్రాన్స్ జెండర్, మైనార్టి, లేదా ఇబిసిలకు రూ.250
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 2,424 పోస్టులు కలవు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి మూల వేతనం నెలకు రూ.21,700 ఉంటుంది. మూల వేతనంతో పాటు ఇతర అలవెన్సులు కలిపి సుమారు రూ.40 వేలు వరకు అందుకోవచ్చు.
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 394
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు 163
ట్రెయిన్స్ క్లర్క్ పోస్టులు 77
పై మూడు పోస్టుల వారికి మూల వేతనం రూ. 19,900 ఉంటుంది. మూల వేతనంతో పాటు ఇతర అలవెన్సులు కలిపి సుమారు రూ.36 వేలు వరకు అందుకోవచ్చు.
పూర్తి వివరాలకు అభ్యర్థులు https://rrbchennai.gov.in వెబ్‌సైట్ చూడగలరు.
Job News: ఆర్మీలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లర్క్ పోస్టులు
[…] […]
[…] […]