ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో గూడ్స్‌ను ఢీకొన్న ప్యాసింజ‌ర్ రైలు

రాయ్‌పుర్‌ (CLiC2NEWS): ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బిలాస్‌పుర్‌లో మంగ‌ళ‌వారం రెండు రైళ్లు ఢీకొన్నాయి. లాల్ ఖ‌దాన్ ప్రాంతంలో నాలుగు గంట‌ల స‌మయంలో గూడ్స్ రైలును మెము ప్యాసింజ‌ర్ రైలు గూడ్స్ రైలును ఢీకొట్టింది. గూడ్స్ రైలు పైకి కొన్నిబోగీలు ఎక్కాయి మ‌రి కొన్ని బోగీలు ప‌ట్టాలు త‌ప్పాయి. ప‌లువురు మృతి చెందిన‌ట్లు స‌మాచారం. దీంతో బిలాస్‌పుర్‌-హ‌వ్‌డా లైన్ మార్గంలో రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌లిగింది. ప‌లు రైళ్ల‌ను దారిమ‌ళ్లించ‌గా.. కొన్ని స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేశారు. ఈ ప్ర‌మాదం కార‌ణంగా రైలు మార్గంలో ఎల‌క్ట్రిక్ వైర్లు, సిగ్న‌ల్ వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన్న‌ది. ఘ‌ట‌నా స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

 

Rangareddy: చేవెళ్ల స‌మీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 19 మంది మృతి

Leave A Reply

Your email address will not be published.