హనుమకొండ జిల్లాలో చెట్టును ఢీ కొన్న కారు.. ఇద్దరు మృతి
హనుమకొండ (CLiC2NEWS): హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కొత్తగట్టు శివారులో బుధవారం అర్థరాత్రి చెట్టును కారు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మారో ఇద్దరికి గాయాలయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పరకాల మండలానికి చెందిన బొంపల్లి కిషన్, వెంకటేష్, ఆత్మకూరుకు చెందిన చింతపట్ల మురళీకృష్ణ, భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక పల్లికి చెందిన పి. సంపత్ కలిసి కారులో పరకాల నుంచి హనుమకొండ వైపు వెళ్తున్నారు.
కాగా అర్థరాత్రి కొత్తగట్టు శివారులో కారు స్పీడుగా వెళ్తూ రోడ్డుపక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. ఈ ఘటనలో పి. సంపత్, బొంపల్లి కిషన్ ప్రమాదం స్థలంలోనే మరణించారు. తీవ్రంగా గాయపడిన మురళీకృష్ణ, వెంకటేష్ లను వరంగల్ ఎజిఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: గురువారం పెళ్లి.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
[…] […]