గురువారం పెళ్లి.. మ‌నస్తాపంతో యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌

బోధ‌న్ (CLiC2NEWS): గురువారం వివాహం.. ఎంతో సంతోషంగా పెళ్లిపీట‌లెక్కాల్సిన యువ‌కుడు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న మంగ‌ళ్‌ప‌హాడ్‌లో జ‌రిగింది. బోధ‌న్ పోలీసుల క‌థ‌నం మేర‌కు..

నిజామాబాద్ జిల్లా ఎడ‌ప‌ల్లి మండ‌లంలోని మంగ‌ళ్ ప‌హాడ్ గ్రామానికి చెందిన ప్ర‌తాప్ (30) , అత‌ని కుటుంబ స‌భ్యుల మ‌ధ్య సోమ‌వారం చిన్న‌పాటి గొడ‌వ జ‌రిగింది. చిన్న‌పాటి గొడ‌వ‌కే తీవ్ర మ‌న‌స్థాపానికి గురైన ప్ర‌తాప్ ఇంటినుంచి వెళ్లిపోయాడు. దాంతో కుటుంబీకులు పోలీసు స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు.

ఈ మేర‌కు పోలీసులు మిస్సింగ్ కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు. ప్ర‌తాప్ ఆచూకీ కోసం పోలీసులు, కుటుంబీకులు గాలింపు చ‌ర్య‌లు చేపట్టారు. మంగ‌ళ‌వారం నాడు ఠ‌ణాక‌లాన్ శివారులో గ‌ల గుట్టల్లోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని మృత‌దేహాన్ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు సిఐ విజ‌య్ బాబు వివ‌రించాడు. కాగా గురువార‌మే వివాహ‌ముండ‌టంతో పెళ్లింట విషాదం నెల‌కొంది.

Alsor Read: `మ‌ద్ది` క్షేత్రానికి పోటెత్తిన భ‌క్త‌జ‌నం

Leave A Reply

Your email address will not be published.