సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోడీ
పుట్టపర్తి (CLiC2NEWS): ఎపిలోని పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేరుకున్నారు. సత్యసాయిబాబా శత జయంత్యుత్సవాల్లో ప్రధాని పాల్గొన్నారు. ప్రధాని వెంట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ ఉన్నారు. ప్రదాని సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో సత్యసాయి జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ. 100 నాణెం, నాలుగు తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ఐశ్యర్యారాయ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారాలోకేశ్ తదితరులు హాజరయ్యారు.
Also Read: పంచాంగంఫ 16- 22 (2025)


[…] సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో ప… […]