10 వేలు ఇస్తానన్న టీఆర్‌ఎస్‌ కావాలా.. 25 వేలు ఇస్తామన్న బీజేపీ కావాలా

బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌

హైద‌రాబాద్‌: 10 వేలు ఇస్తా అని ఇవ్వని టీఆర్‌ఎస్‌ కావాలా.. 25 వేలు బ్యాంక్ అకౌంట్ లో వేస్తామని చెప్పిన బీజేపీ కావాలా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఆయన హబ్సిగూడా లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే మళ్ళీ కేసీఆర్ అవే హామీలు ఇచ్చారని, ఆర్థిక సంఘం నిధులు 1287 కోట్లు కేంద్రం ఇస్తే.. 78 కోట్లు రాష్ట్రం ఇచ్చిందని మండిపడ్డారు. కేంద్రం రెండు లక్షల ఇళ్లను మంజూరు చేసిందని, లక్షా 40 వేలు హైదరాబాద్ కి మంజూరు చేసిందని తెలిపారు. ఇళ్ల కోసం 2,280 కోట్లను కేంద్రం ఇచ్చిందని.. నేను మాట్లాడింది తప్పు అయితే తనను అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే హబ్సిగూడా కి వచ్చి ముక్కు నేలకు రాయాలని సవాల్‌ విసిరారు. 2 లక్షల కోట్లు పన్నుల రూపంలో ఇక్కడ ప్రజలు కడితే.. 67 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు.

Leave A Reply

Your email address will not be published.