ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురుకాల్పులు.. ఐదుగురు మావోయిస్టులు మృతి

రాయ్‌పూర్ (CLiC2NEWS): ఈ మ‌ధ్య కాలంలో డ‌జ‌న్ల‌కొద్ది మావోయిస్టులు లొంగిపోయిన విష‌యం తెలిసిందే.. అలాగే హిడ్మాలాంటి అగ్ర‌మావోయిస్టుతో పాటు ప‌లువురు ఎన్‌కౌంట‌ర్‌లో చ‌నిపోయిన విష‌యం కూడా విధిత‌మే.. ఈ క్ర‌మంలో మావోయిస్టులకు, పోలీసుల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌ర‌గుతూనే ఉన్నాయి.

తాజాగా ఛ‌త్తీస్‌గ‌ఢ్ ని బీజాపూర్‌లో మావోయిస్టులు, పోలీసుల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందిన‌ట్లు సమాచారం.

ఘ‌ట‌నా స్థ‌లంలో భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Also Read : హైద‌రాబాద్‌లో గుండెపోటుతో ఎస్ఐ మృతి

Leave A Reply

Your email address will not be published.