హైదరాబాద్‌లో గుండెపోటుతో ఎస్ఐ మృతి
హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్‌లో పోలీసు స్టేషన్‌లో ఎస్ ఐ గుండెపోటుతో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఎల్ బి నగర్ పోలీసు ఠాణాలోనే ఎస్ ఐ సంజయ్ సావంత్ (58) గుండెపోటుతో మృతి చెందారు.
మంగళవారం రాత్రి పోలీసు స్టేషన్‌లోనే ఎస్ ఐ సంజయ్ సావంత్ నిద్రించారు.
నేడు (బుధవారం) అబ్దుల్లాపూర్‌మెట్‌లో పంచాయతి ఎన్నికల డ్యూటీ వెళ్లాల్సిన నేపథ్యంలో పిఎస్‌లో ఉన్న సంజయ్ గుండెపోటు రావడంతో మృతిచెందారు.
నాచారంలో నివాసముంటున్న సంజయ్ మృతితో అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Also Read: బంగారంతో పోటీపడుతున్న వెండి!
[…] Also Read : హైదరాబాద్‌లో గుండెపోటుతో ఎస్ఐ మృతి […]