`అఖండ‌-2` విడుద‌ల వాయిదా!

వెల్లడించిన నిర్మాణ సంస్థ‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో న‌ట‌సింహం బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా రూపొందిన `అఖండ‌-2` సినిమా వాయిదా ప‌డింది. ఈ చిత్రం విడుద‌ల‌పై గురువారం సాయంత్రం నుంచి కొన్ని గంట‌ల‌పాటు తీవ్ర సందిగ్ధ‌త నెల‌కొంది. ప‌లు టీవీ ఛానళ్ల‌లో ఈ సినిమా స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. గురువారం రోజు రాత్రి అనుకున్న‌ట్లుగా వేయాల్సిన ప్రిమియ‌ర్స్ ను ర‌ద్దు చేశారు. దాంతో అంత‌కు ముందు వ‌చ్చిన వార్త‌ల‌కు బ‌లం చేకూరింది.

చివ‌ర‌కు `అఖండ‌- 2`ను వాయిదా వేస్తున్న‌ట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్ల‌స్ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు 14 రీల్స్ ప్ల‌స్ సంస్థ ట్విట్ట‌ర్ (ఎక్స్‌)లో పోస్టు చేసింది.

“అనివార్య పరిస్థితుల కారణంగా `అఖండ2` షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదు.. ఈ విష‌యం ప‌ట్ల చింతిస్తున్నాము. ఇది మాకు బాధాకరమైన క్షణం, సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రతి అభిమానికి ఇది కలిగించే నిరాశను మేము అర్థం చేసుకుంటాము. దీన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి మేము కృషి చేస్తున్నాము. కలిగిన అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలు.“అని ఎక్స్‌లో పోస్టు చేశారు.

 

Also Read: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురుకాల్పులు.. ఐదుగురు మావోయిస్టులు మృతి

 

1 Comment
  1. […] Also Read : `అఖండ‌-2` విడుద‌ల వాయిదా! […]

Leave A Reply

Your email address will not be published.